నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్ జంటగా నటించిన ‘వీరసింహారెడ్డి’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లలో దుమ్ము రేపినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,500 థియేటర్లలో విడుదలైంది. వరల్డ్ వైడ్‌గా తొలి రోజు రూ.50 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు చిత్ర నిర్మాత నవీన్ ఎర్నేని తెలిపారు. సంక్రాంతి పండుగ కావడంతో కలెక్షన్లు మరింత పెరగొచ్చని పేర్కొన్నారు. కాగా ‘వీరసింహారెడ్డి’ మూవీ జనవరి 12న థియేటర్లలో విడుదలై సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది.