నందమారి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ మూవీ రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో జనవరి 6న ఒంగోలులోప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. కానీ ముందుగా నిర్ణయించినట్లుగా ఏబీఎం గ్రౌండ్లో ఈవెంట్ రద్దు అయింది. పోలీసుల అనుమతి నిరాకరణతో వేదికను మార్చారు. నగర శివారులోని ‘బీఎమ్ఆర్ ఇన్ఫ్రా’లో ఈవెంట్ నిర్వహించాలని మూవీ యూనిట్ నిర్ణయించింది. డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది.