నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘వీరసింహారెడ్డి’ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో అదిరే వసూళ్లు రాబడుతోంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో తొలి రోజు ఏకంగా రూ.43 లక్షలు కొల్లగొట్టింది. ఎటువంటి హైప్ లేకుండా, తక్కువ టికెట్ ధరలతో భారీ కలెక్షన్లు రాబట్టింది. హైక్ ఉండి ఉంటే ఖచ్చితంగా క్రాస్‌రోడ్స్‌లో టాప్ 3 లో ఉండేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. క్రాస్‌రోడ్స్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న4వ సినిమాగా నిలిచింది.