దేశీయ మార్కెట్లో వాహన విక్రయాలు నవంబరు నెలలో జోరుగా సాగాయి. గతేడాది నవంబరుతో పోలిస్తే ప్రతి ప్రధాన కంపెనీ యూనిట్ల విక్రయాల్లో వృద్ధిని నమోదు చేసింది. టాటా మోటార్స్(21%), హ్యుండయ్ మోటార్స్(36%), మారుతీ సుజుకీ(14%) వృద్ధిని నమోదు చేస్తూ అత్యధిక వాహనాలను విక్రయించాయి. ప్రయాణికుల వాహనాలతో పాటు మధ్యస్త, భారీ వాణిజ్య వాహనాల విక్రయాలూ పెరగడం గమనార్హం. దేశీయంగా గిరాకీ పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. ద్విచక్రవాహనాల్లోనూ హీరో మోటార్స్, హోండా మోటార్స్, టీవీఎస్ల విక్రయాలు పెరగ్గా, బజాజ్ ఆటో విక్రయాలు క్షీణించాయి.
నవంబరులో వాహన విక్రయాల జోరు

© Envato