భారత్ చీఫ్ సెలెక్టర్ రేసులో మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ముందంజలో ఉన్నారు. వెంకటేశ్ ప్రసాద్‌కు అన్ని విధాలుగా అనుభవం ఉంది. 53 ఏళ్ల వెంకటేశ్ భారత్ తరఫున 33 టెస్టులు, 161 వన్డేలు ఆడారు. రెండు ఫార్మాట్లలో కలిపి దాదాపు 300 వికెట్లు తీశారు. మరోవైపు 2016-18 మధ్యలో భారత ఏ జట్టు సెలెక్టర్‌గా కూడా వెంకటేశ్ సేవలు అందించాడు. ఇవన్నీ కలుపుకుంటే ప్రస్తుతం బలమైన పోటీదారుగా ఆయన నిలుస్తాడు. మిగతా అభ్యర్థులకు గట్టి పోటీనిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.