మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో ‘గుంత‌ల‌కిడి గురునాదం’గా వెన్నెల కిశోర్‌

నితిన్ హీరోగా న‌టిస్తున్న ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ మూవీ నుంచి వెన్నెల కిశోర్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇందులో వెన్నెల కిశోర్ ‘గుంత‌ల‌కిడి గురునాదం’ అలియాస్ గురు పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఆయ‌న బాగా ఈగో ప‌ట్టిన వ్యక్తి అంటూ ప‌రిచ‌యం చేశారు. పోస్ట‌ర్‌లో వెన్నెల కిశోర్ చాలా ఫ‌న్నీగా క‌నిపిస్తున్నాడు. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో కృతిశెట్టి, కేథిరిన్ థ్రెసా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఆగ‌స్ట్ 12న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Exit mobile version