‘బిగ్ బీ’తో వర్మ మరో సినిమా

రాంగోపాల్ వర్మ, బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కలయికలో గతంలో అనేక చిత్రాలు వచ్చాయి. ‘సర్కార్’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో పాటు సర్కార్ రాజ్, సర్కార్ 3’ ‘ఆగ్, నిశ్శబ్ద్, రన్, డిపార్ట్ మెంట్’ చిత్రాలను వర్మ తెరకెక్కించారు. ఇప్పుడు కూడా తాను హిందీ చిత్రాలు తీస్తున్నానని, వచ్చే నెలలో రాబోతున్న ‘లడ్కీ’ హిందీలోనే తీశానని వర్మ చెప్పారు. అలానే అమితాబ్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నానని తెలిపారు. హారర్ జానర్ లో ఉండే ఈ సినిమా షూటింగ్ నవంబర్ లో మొదలు కావొచ్చని వర్మ వెల్లడించారు.

Exit mobile version