• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • డీహెచ్‌పై వీహెచ్‌పీ నేతలు ఆగ్రహం

    రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుపై విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాపై శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను ఖండించింది. కొత్తగూడెంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న హెల్త్ డైరెక్టర్.. ఏసుక్రీస్తు వల్లే కరోనా తగ్గిందని వ్యాఖ్యలు చేశారు. దీంతో వీహెచ్‌పీ నేతలు నేడు ఆగ్రహానికి లోనయ్యారు. వెంటనే శ్రీనివాసరావుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పలు చోట్ల వీహెచ్‌పీ నేతలు నిరసన చేపట్టారు. అంతకుముందు కూడా శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేసి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.