బీజేపీపై 2.88లక్షల ఓట్లతో విజయం

© ANI Photo

గుజరాత్‌లో బీజేపీ ప్రభంజనం సృష్టించినా ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో మాత్రం చతికిలపడింది. ఇక్కడ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఏకంగా 2.88లక్షల పైచిలుకు ఓట్ల మెజరాటీతో బీజేపీ అభ్యర్థిపై ఎస్పీ అభ్యర్థి డింపుల్ యాదవ్ అఖండ విజయం సాధించారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ మరణించడంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ములాయం కోడలు, అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఎస్పీ తరఫున పోటీ చేశారు. ములాయం సోదరుడు శివపాల్‌సింగ్‌కు నమ్మకస్తుడైన రఘురాజ్ సింగ్ షాక్యాను బీజేపీ బరిలోకి దింపినా ఓటర్లు ఎస్పీ వైపే నిలిచారు.

Exit mobile version