కోలీవుడ్ (Kollywood) నటుడు అజిత్ (Ajith)కు దేశ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భాష, ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా అందరూ ఆయన్ను అభిమానిస్తుంటారు. తెలుగు ప్రేక్షకులు సైతం అజిత్ నటన, ఆయన చేసిన చిత్రాలను ఇష్టపడుతుంటారు. అటువంటి అజిత్ నుంచి ఈ సంక్రాంతికి ఓ క్రేజీ సినిమా రాబోతుంది. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో చేసిన ‘విడముయార్చి’ సినిమా పొంగల్‌కు లాక్ అయ్యింది. ఇందులో అజిత్‌కు జోడీగా స్టార్ హీరోయిన్ త్రిష (Actress Trisha) నటిస్తోంది. కాగా, ఇప్పటికే సంక్రాంతి రేసులో నిలిచిన స్టార్ హీరోలు రామ్‌చరణ్ (Ramcharan), బాలకృష్ణ (Balakrishna), వెంకటేష్ (Venkatesh)లతో అజిత్ తలపడటనుండటంతో అందరి దృష్టి ‘విడముయార్చి’పై పడింది.
హాలీవుడ్ లెవల్లో..
హీరో అజిత్ (Ajith), డైరెక్టర్ మగిజ్ తిరుమేని (Magizh Thirumeni) కాంబోలో రూపొందుతున్న ‘విడముయార్చి’ (Vidaamuyarchi) చిత్రాన్ని ఫేమస్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇందులో సీనియర్ నటుడు అర్జున్ (Arjun), రెజీనా కసాండ్రా (Regina Cassandra) నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ (Vidaamuyarchi Teaser)ను రిలీజ్ చేశారు. ఒక నిమిషం 48 సెకన్లపాటు సాగిన ఈ టీజర్ ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం విశేషం. టీజర్ ప్రారంభంలో అర్జున్, రెజీనా గట్టిగా నవ్వే సౌండ్ తప్ప మిగతాదంతా అనిరుధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే సాగిపోయింది. హాలీవుడ్ స్థాయి లోకేషన్స్ ఓ వింత ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఫీలింగ్ కనిపించాయి. కంప్లీట్ యాక్షన్ ప్యాక్‌గా ఈ చిత్రం రాబోతున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది.
ఆ రియల్ స్టంట్ గుర్తుందా!
‘విడముయార్చి’ (Vidaamuyarchi) చిత్రాన్ని 2025 జనవరి 10న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో ఛేజింగ్ సీన్స్ ఎక్కువగా ఉండనున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. అయితే గతంలో డూప్ లేకుండా ఛేజ్ సీన్ చేస్తూ నటుడు అజిత్ కారు ప్రమాదానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా తెగ వైరల్ అయ్యింది. ఆ సీన్‌ను ‘విడముయార్చి’కి సంబంధించే షూట్ చేశారు. సన్నివేశంలో భాగంగా తన పక్కన ఉండే వ్యక్తిని కాపాడేందుకు అజిత్ ఫాస్ట్‌గా కారు డ్రైవ్ చేయాలి. డూప్ లేకుండా తానే స్వయంగా వెహికల్ నడిపాడు. దీంతో ఒక్కసారిగా కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదం నుంచి ఆయన చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. ‘ధైర్యానికి హద్దులు ఉండవని నిరూపించిన హీరో’ అంటూ అప్పట్లో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ ఆ వీడియోను రిలీజ్ చేయడం విశేషం.
థియేటర్లు కష్టమే!
సంక్రాంతి (Sankranthi Movies 2025) బరిలో ఇప్పటికే టాలీవుడ్ నుంచి మూడు చిత్రాలు నిలిచాయి. రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer), బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ (Daku Maharaj), వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) చిత్రాలు ఇప్పటికే రిలీజ్ డేట్స్‌ను సైతం అనౌన్స్ చేశాయి. అవి వరుసగా జనవరి 9, 11, 13 తేదీల్లో థియేటర్లలో సందడి చేయనున్నాయి. అజిత్ తాజా చిత్రం ‘విడముయార్చి’ను ఆ డేట్స్ క్లాష్ కాకుండా జనవరి 10న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నలుగురు బడా హీరోల మధ్య బిగ్ ఫైట్ తప్పదని ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ‘గేమ్ ఛేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలను నిర్మించడం, ‘డాకు మహారాజ్’ నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా దిల్‌రాజు (Diraju)వెళ్లడంతో 70% థియేటర్లు ఆయన చేతిలోకి వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూడు చిత్రాలను దాటుకొని అజిత్ సినిమాకు థియేటర్లు వెళ్లడం కష్టమేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తక్కువ స్క్రీన్లతోనే అజిత్ మూవీ సరిపెట్టుకోవాల్సి రావొచ్చని అంటున్నారు.
Featured Articles Movie News Telugu Movies
Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్.. ‘క్వార్టర్, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’