విజయ్ దేవరకొండ, సమంత క్రేజీ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఖుషి’. ‘లైగర్’ ఫ్లాప్ తర్వాత దేవరకొండ, చైతన్యతో విడాకుల తర్వాత సమంత బ్రాండ్ ఇమేజ్‌పై అనేక మంది అనుమానం వ్యక్తం చేశారు. కానీ వాటన్నంటినీ ఖుషీ పటాపంచలు చేసింది. సినిమా తెలుగు, తమిళ, హిందీ, మళయాల నాన్- థియెట్రికల్ రైట్స్ ఏకంగా రూ.92 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. థియేటర్లలోనూ ఈ సినిమాకు భారీగానే డిమాండ్ ఉండేలా కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సినిమా విడుదలకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
విజయ్, సమంత అంటే మినిమమ్ ఉంటది మరి!
