తమిళ్ హీరో విజయ్ ఆంటోనీ ‘పిచ్ఛైకారన్ 2’ షూటింగ్లో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మలేషియాలోని ఓ దీవిలో జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న బోట్ కెమెరాలు ఉన్న పడవను ఢీకొట్టడంతో ఆయనకు గాయాలయ్యాయి. దీంతో విజయ్ కోమాలోకి వెళ్లాడు అంటూ పుకార్లు పుట్టాయి. దీనిపై విజయ్ సన్నిహితులు స్పందించారు. అతడి నడుముకు గాయాలయ్యాయని.. కోలుకుంటున్నాడని తెలిపారు. ప్రస్తుతం విజయ్ చెన్నై వచ్చేశాడు.