లైగర్ విషయంలో చెలరేగిన వివాదంలో హీరో విజయ్ దేవరకొండ ED విచారణ ముగిసింది. సుమారు 11 గంటల పాటు అధికారులు విజయ్‌ని విచారించారు. లైగర్ చిత్రం లావాదేవీలపై ప్రశ్నించినట్లు సమాచారం. అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని, మళ్లీ రమ్మని సూచించలేదని విజయ్ వెల్లడించారు. పాపులారిటీ వల్ల వచ్చే సమస్యల్లో ఇదొకటని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత చార్మీలను ఈడీ విచారించింది. లైగర్ సినిమా పెట్టుబడుల్లో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.