రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం సమంతతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. మరోవైపు తన ‘లైగర్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ఓ వీడియో పోస్ట్ చేశాడు. తెల్ల చొక్కాలో, స్టైల్‌గా పడవలో కూర్చొని బోట్ షికారి చేస్తున్న వీడియోను విజయ్ షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్స్, విజయ్ ఫ్యాన్స్ తెగ లైకులు, కామెంట్లు చేస్తున్నారు.