కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన మూవీ ‘విక్రమ్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సినిమా విడుదలైన మూడు రోజుల్లో రూ.150 కోట్ల వసూళ్లు సాధించింది. మంచి పాజిటివ్ రివ్యూలు రావడంతో ముఖ్యంగా ఈ వీకెండ్లో సినిమాకు భారీగా తరలివచ్చారు. విదేశాల్లోనూ సినిమా కలెక్షన్లలో దుమ్ములేపుతుంది. ఇప్పటివరకు అమెరికాలో రూ.10.65 కోట్లు, యూకేలో రూ.2.78 కోట్లు, ఆస్ట్రేలియాలో రూ.2.60 కోట్లు, న్యూజిలాండ్‌లో రూ.24 లక్షలు వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ రాబట్టింది.