కమల్ హాసన్, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కలిసి నటించిన ‘విక్రమ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కురిపించిన సంగతి తెలిసిందే. లోకేశ్ కనగరాజ్ దీనికి దర్శకత్వం వహించాడు. జులై 8 నుంచి మూవీ ప్రముఖ ఓటీటీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడ కూడా విక్రమ్ కొత్త రికార్డులను క్రియేట్ చేసిందని హాట్‌స్టార్ తెలిపింది. ఇంతకు ముందు ఉన్న అత్యధిక స్ట్రీమింగ్ టైమ్‌ను అధిగమించి విక్రమ్ దూసుకెళ్తుంది. అదేవిధంగా అన్ని భాషల్లో కలిపి బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ సాధించిందని వెల్లడించింది. దీనిపై స్పందించిన కమల్‌హాసన్ విక్రమ్ హాట్‌స్టార్ అందరికి చేరువ కావడం సంతోషంగా ఉందని తెలిపాడు. ఈ సందర్భంగా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశాడు.
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘విక్రమ్’
