విక్రమ్ ‘కోబ్రా’ ట్విట్టర్‌ రివ్యూ

తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన కోబ్రా సినిమా ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైంది. విదేశాల్లో ఇప్పటికే ఈ మూవీ ప్రిమియర్ షోలు ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్‌లో తమ అభిప్రాయాలు చెబుతున్నారు. మూవీలో విక్రమ్ ఎంట్రీ సీన్ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.రెహ‌మాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలెట్‌గా ఉందంటున్నారు. ఫస్ట్ హాఫ్ వేరే లెవల్లో ఉందంట.ఇంటర్వెల్ సీన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయని చెబుతున్నారు. సస్పెన్స్ చాలా బాగుందని కామెంట్ చేస్తున్నారు. జ్ఞాన‌ముత్తు డైరెక్షన్ సూపర్‌గా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీని కచ్చితంగా థియేటర్లలో చూడాలని చెబుతున్నారు. అయితే ఫుల్ రివ్యూ కోసం మరికొద్దిసేపు ఆగాల్సిందే.

Exit mobile version