సంక్రాంతి అంటేనే కోడి పందాలు. ఈ కోడి పందాల వల్ల చాలా మంది అమాయకపు ప్రజలు ఏటా పెద్ద మొత్తంలో డబ్బు పొగొట్టుకుంటున్నారు. దీంతో ఏపీలోని పలు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా కోడి పందాలు నిర్వహించకూడదని కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో పలుగ్రామాలు కోడి పందాలు నిర్వహించుకోకుండా గ్రామస్థాయిలో కమిటీలు వేసుకున్నాయి. వీరితో పాటు అధికారులు కూడా కోడి పందాలపై ఆంక్షలు విధించారు. ఈనెల 25 వరకు జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కలెక్టర్ తెలిపారు.