తిరుమ‌ల‌లో పెరిగిన భ‌క్తుల ర‌ద్దీ 5రోజులు బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

Courtesy Twitter: ttd

తిరుమ‌ల‌లో రేప‌టినుంచి 5 రోజుల వ‌ర‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేయ‌నున్న‌ట్లు తితిదే ప్ర‌క‌టించింది. కోవిడ్ త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో భ‌క్తుల ర‌ద్దీ పెరిగిపోయింది. అందుకే ర‌ద్దీని నియంత్రించ‌డం కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. మ‌రోవైపు రెండురోజుల త‌ర్వాత నేడు టోకెన్ల‌ను పంపిణీ చేయ‌డంతో నేడు భారీ సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. దీంతో టోకెన్లు లేక‌పోయినా అనుమ‌తించారు. రెండేళ్ల త‌ర్వాత‌ వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి భ‌క్తుల‌ను అనుమ‌తిస్తున్నారు.

Exit mobile version