విరాట్ మాకు మూడో ఓపెనర్

© ANI Photo:File

విరాట్ కోహ్లీ తమకు మూడో ఓపెనర్‌ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. రాహులే తమ మొదటి ప్రాధాన్యమని నొక్కిచెప్పాడు. ఓపెనర్‌గా మరో ప్రత్యామ్నాయ బ్యాటర్‌ని తీసుకోకపోవడంతో విరాట్ ఓపెనింగ్ చేయొచ్చని రోహిత్ అభిప్రాయపడ్డాడు. కొన్ని మ్యాచుల్లో విరాట్‌తో ఓపెనింగ్ చేయిస్తామన్నాడు. ప్రయోగాలకు పరిమితులుండవని.. కోహ్లీ సత్తా అందరికీ తెలిసిందేనని కెప్టెన్ చెప్పాడు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా కోహ్లీ రాణించిన విషయాన్ని రోహిత్ గుర్తుచేశాడు.

Exit mobile version