టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు మ్యాచుల యావరేజ్ 50కి తగ్గిపోయింది. 2017 తర్వాత మొదటిసారి అతడి యావరేజ్ 50కి తగ్గింది. 101 టెస్టులు ఆడిన కోహ్లీ 8వేలకు పైచిలుకు పరుగులు చేశాడు. కోహ్లీ పింక్ బాల్ టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో నిరాశపర్చాడు. మొదటి ఇన్నింగ్సులో 23, రెండో ఇన్నింగ్సులో 13 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఈ మాజీ కెప్టెన్ యావరేజ్ 50 కంటే దిగువకు పడిపోయింది.