శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి అదరగొట్టాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 74వ సెంచరీని నమోదు చేశాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 46వ సెంచరీ కావడం విశేషం. 85బంతుల్లో కోహ్లీ సెంచరీని అందుకున్నాడు. వన్డేల్లో ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. శ్రీలంకపై 10 సెంచరీలు చేసి సచిన్(9) రికార్డును అధిగమించాడు. అలాగే, సొంతగడ్డపై 21(100 ఇన్నింగ్సులు) సెంచరీలు చేసి సచిన్(20/166) పేరిట ఉన్న మరో రికార్డును తిరగరాశాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలోనూ కోహ్లీ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే.