టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించాడు. తాజాగా డబుల్ సెంచరీ సాధించాడు. మ్యాచెస్ జరగలేదు ఎలా డబుల్ సెంచరీ కొట్టాడు అని ఆలోచిస్తున్నారా ? ఆ విషయమే చెప్తున్నాం. సోషల్ మీడియా ప్లాట్పామ్ ఇన్స్టాగ్రామ్ లో కోహ్లీ 200 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించాడు. ఈ మార్కును అందుకున్న తొలి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అత్యధిక ఫాలోవర్లు కలిగిన జాబితాలో మొదటి రెండు స్థానాల్లో రోనాల్డో, మెస్సి ఉండగా మూడో స్థానంలో కోహ్లీ నిలవడం విశేషం.