టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 100 టెస్టులు ఆడి అరుదైన ఘనత సాధించాడు. ఈ టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ చేయలేదు కానీ.. ఆ మ్యాచులో టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో అరుదైన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం బస్‌లో హోటల్‌కు వెళ్తున్న కోహ్లీ అక్కడే ఉన్న ధరమ్వీర్ పాల్ అనే దివ్యాంగుడికి తన జెర్సీని అందజేశాడు. దీంతో ఆ దివ్యాంగుడు కోహ్లీ గిఫ్టుతో ఫుల్ ఖుషీ అవుతూ ట్విటర్లో పోస్ట్ చేశాడు.