టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాటుల కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తెలిసిందే. అయితే దీనిపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం సరైన నిర్ణయమేనని, దీంతో అతను ఐపీఎల్ ప్రశాంతంగా ఆడగలడని పేర్కొన్నాడు. కానీ విరాట్ మళ్ళీ టెస్ట్ కెప్టెన్సీ పగ్గం చేపట్టాలని కోరుకుంటున్నానని విరాట్ నాయకత్వం చాలా బాగుంటుందన్నారు. విరాట్ ఎలాంటి కెప్టెనో తెలుసుకోవాలంటే అతని రికార్డులు చూస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డాడు.