టీమ్‌ఇండియా బ్యాటర్లు విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారాపై ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి బ్యాటింగ్‌పై జట్టు మేనేజ్‌మెంట్ నిఘా పెట్టి ఉండొచ్చని హాగ్ అంచనా వేశాడు. ‘ఒకవేళ విరాట్, పుజారా ఫామ్ అందుకోలేకపోతే తప్పకుండా వారి స్థానాల్లో యువ క్రికెటర్లకు అవకాశం రావచ్చు. ఇటీవల దేశీయ క్రికెట్‌లో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్‌ను జట్టులోకి తీసుకుంటారని అనుకుంటున్నా. కానీ, ఇప్పటికే చోటు కోసం ఎదురు చూస్తున్న సూర్యకుమార్ యాదవ్‌నే తొలుత తీసుకునే అవకాశం ఉంది’ అని అన్నాడు.