టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పాడిన ఓ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ ఫంక్షన్లో బంగ్లాదేశ్ గాయని ఫహ్మిదా నబీహాస్తో కలిసి ప్రముఖ దివంగత గాయని లతామంగేష్కర్ పాడిన పాటను వారు పాడారు. ‘జో వాదా కియా వో’లోని ఓ పాటను పాడిన ఈ జంట వీడియోను.. ప్రముఖ మ్యూజిక్ ప్లాట్ఫామ్ అయిన సరెగమ తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవడంతో దివంగత గాయని లతా మంగేష్కర్ని నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. విరాట్ అద్భుతంగా పాడాడని కామెంట్లు చేస్తున్నారు.