సచిన్ 100 సెంచరీల రికార్డుని విరాట్ కోహ్లీ బ్రేక్ చేస్తాడని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. విరాట్ వయసు, ఫిట్‌నెస్ అతడికి సహకరిస్తాయని భజ్జీ వెల్లడించాడు. వయసు 34 అయినప్పటికీ 24 ఏళ్ల కుర్రాడి మాదిరి ఫిట్‌నెస్‌ని కలిగి ఉన్నాడని తెలిపాడు. ‘నా మాటలు మీకు అతిశయోక్తి అని అనిపించొచ్చు. కానీ, విరాట్‌కి ఈ ఫీట్ సాధ్యమే. ప్రస్తుతం 75 సెంచరీలతో ఉన్నాడు. విరాట్ ప్రయత్నిస్తే మరో 50 చేయగలడు. అన్ని ఫార్మాట్లలో అతడు ఆడగలడు’ అని హర్భజన్ చెప్పాడు. ఆసీస్‌తో నాలుగో టెస్టులో కోహ్లీ సెంచరీ బాదిన విషయం తెలిసిందే.