రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల తెరకెక్కించిన మూవీ ‘విరాట పర్వం’. నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. అసలు సినిమా ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం వెన్నెల గురించి సాగుతుందని, స్క్రీన్ ప్లే ఆకట్టుకునేలా ఉంటుందని చెబుతున్నారు. ఇంట్రో సీన్స్, కొన్ని ఎలివేషన్ సీన్స్ బాగున్నాయట. పవర్ ఫుల్ ఎమోషన్స్ ఎగ్జైట్‌మెంట్ స్క్రీన్ ప్లేతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. సెకండ్ హాఫ్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్, లవ్ ట్రాక్ అద్భుతంగా ఉంటుందని, సినిమాకు సెకండ్ హాఫ్ ప్లస్ అని చెబుతున్నారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని, ఓవరాల్‌గా మూవీ బంఫర్ హిట్ అంటూ ట్విట్టర్‌లో ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.