దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా నటించిన ‘విరాట పర్వం’ సినిమా జులైలో థియేటర్లలో విడుదల కాబోతుంది. వేణు ఉడుగుల దర్శకత్వం వహించాడు. 1990లలో తెలంగాణలో జరిగిన నక్సలైట్ ఉద్యమం నేపథ్యంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర వంటి వాళ్లు కీలక పాత్రలు పోషించారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా జులై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.