రానా, సాయిపల్లవి జంటగా నటించిన ‘విరాట పర్వం’ సినిమా విడుదల తేదీ మరోసారి మారింది. చాలా వాయిదాల తర్వాత జులై 1న రిలీజ్ చేయనన్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే తాజాగా సినిమాను రెండు వారాల ముందుగానే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జూన్ 17న విరాట పర్వం థియేటర్లలోకి రాబోతుందట. రవితేజ రామారావు ఆన్ డ్యూటీ వాయిదా పడటంతో అదే రోజు ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. మరి అనుకున్న తేదీకంటే ముందుగానే మూవీ వస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.