దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల తెరకెక్కించిన మూవీ ‘విరాట పర్వం’. నక్సల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ మూవీ.. జూన్ 17న విడుదలైన మంచి టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ సినిమా కల్లెక్షన్లు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. తొలి వీకెండ్ ముగిసే సరికి ఈ మూవీ కేవలం రూ.3.14 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. వీక్ డేస్లో ఈ కలెక్షన్స్ మరింత డ్రాప్ అవుతుండగా.. మంచి టాక్ సొంతం చేసుకున్నప్పటికీ సినిమా డబుల్ డిజాస్టర్ వైపు వెళ్తుందని అంటున్నారు. మొత్తం రూ.14 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ కనీసం రూ.15 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.