రానా, సాయి పల్లవి జంటగా నటించిన ‘విరాట పర్వం’ మూవీ ట్రైలర్ వచ్చేసింది. రానా నక్సలైట్ పాత్రలో నటించాడు. అతడిని ప్రేమిస్తున్న అమ్మాయి పాత్రలో సాయిపల్లవి మరోసారి తన నట విశ్వరూపం చూపించింది. జూన్ 17న మూవీ రిలీజ్ అవుతుంది. సురేశ్ ప్రొడక్షన్స్ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రియమణి, నవీన్ చంద్ర, నివేతా పేతురాజ్, నందితా దాస్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వేణు ఉడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించాడు.