రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల తెరకెక్కించిన మూవీ ‘విరాట పర్వం’. జూన్ 17వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ సెన్సార్ పూర్తయింది. కొన్ని కట్లతో సెన్సార్ బోర్డు ఈ మూవీకి U/A సర్టిఫికెట్ ఇచ్చింది. కొన్ని సన్నివేశాల్లో సాయి పల్లవి, హీరో పలికిన బూతు పదాలను మ్యూట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ఆకట్టుకోవడంతో మూవీ విజయం సాధిస్తుందని అంతా అనుకుంటున్నారు.