టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫామ్ లేమి కారణంగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో అతడిని వెస్టిండీస్, జింబాంబ్వేతో సిరీస్‌కు రేస్ట్ ఇచ్చారు. అయితే తాజాగా కోహ్లీ సెలెక్టర్లకు ఫోన్ చేసినట్టు సమాచారం. తాను త్వరలో జరిగే ఆసియా కప్‌కు అందుబాటులో ఉంటానని కోహ్లీ తెలిపాడట. ఈ విషయంపై బీసీసీఐ అధికారి కూడా స్పష్టతనిచ్చారు. కోహ్లీ ఫోన్ చేసిన విషయం నిజమే. అయితే టీ20 వరల్డ్ కప్ వరకు టీమిండియాకు బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా.. ఆటగాళ్లకు రొటేషన్ పద్దతిలో రెస్ట్ ఇస్తున్నామని పేర్కొన్నారు.