వర్షాకాలం ఇంకా రాకముందే వైరల్ జ్వారాలు మాత్రం ముందుగానే ఎంటరయ్యాయి. ఇప్పటికే ఏపీ విశాలోని చింతపల్లి, జీకే వీధి ప్రాంతాల్లోని CHC, PHCలకు బాధితులు పెద్ద ఎత్తున వస్తున్నారు. వైరల్ జ్వరం వచ్చిన వారు ప్రతిరోజు ఓపీ కోసం 300 మందికిపైగా వస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే వాతావరణంలో ఆకస్మాత్తుగా వచ్చిన మార్పుల కారణంగా ఈ బాధితులు పెరుగుతున్నారని అంటున్నారు. ఉదయం సమయంలో ఎండ తీవ్రత, తర్వాత వెంటనే వర్షం వస్తుందన్నారు.