విద్యుత్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి తెలిపారు. కొత్తగూడెం, తాటిచెర్ల మైనింగ్‌లో ఏడాదికి రూ. 20 వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం జెన్కోను కాపాడి విద్యుత్ కార్మికులకు రావాల్సిన బెనిఫిట్లను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్తగూడెం జెన్కో ఎంప్లాయీస్ యూనియన్ క్యాలెండర్‌ను వెంకటస్వామి రిలీజ్ చేశారు.