‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అక్షయ్ నటించిన బచ్చన్ పాండే, ది కశ్మీర్ ఫైల్స్ రెండు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. బచ్చన్ పాండే సినిమా ఫ్లాప్ అయింది. ది కశ్మీర్ ఫైల్స్‌కు మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ అందరూ ది కశ్మీర్ ఫైల్స్ చూడాలని, చాలా మంచి సినిమా అని చెప్పాడు. కానీ ఆ మాటలు అక్షయ్ మనస్పూర్తిగా మాట్లాడలేదని, మొహమాటానికి చెప్పినట్లు ఉందని వివేక్ కామెంట్స్ చేశాడు. దీంతో అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ ఆ డైరెక్టర్‌పై మండిపడుతున్నారు.