Vivo X100 Series: ఐఫోన్‌ను తలదన్నేలా వివో సరికొత్త మెుబైల్‌.. లీకైన స్టన్నింగ్‌ ఫీచర్స్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vivo X100 Series: ఐఫోన్‌ను తలదన్నేలా వివో సరికొత్త మెుబైల్‌.. లీకైన స్టన్నింగ్‌ ఫీచర్స్‌!

    Vivo X100 Series: ఐఫోన్‌ను తలదన్నేలా వివో సరికొత్త మెుబైల్‌.. లీకైన స్టన్నింగ్‌ ఫీచర్స్‌!

    September 22, 2023

    భారత్‌లో మంచి మార్కెట్‌ ఉన్న మెుబైల్‌ తయారీ కంపెనీల్లో వివో (Vivo) ఒకటి. ఈ కంపెనీ రిలీజ్‌ చేసే స్మార్ట్‌ఫోన్లకు టెక్‌ లవర్స్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే వివో ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ విడుదల చేస్తూ మెుబైల్‌ ప్రియులకు సర్‌ప్రైజ్ ఇస్తుంటుంది. ఈ క్రమంలోనే కొత్తగా ‘Vivo X100 Series’ లాంఛ్‌ చేసేందుకు వివో సిద్ధమైంది. అక్టోబర్‌లో ఇది రానున్నట్లు టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. అయితే విడుదలకు ముందే ఈ ఫోన్‌ ఫీచర్లు లీకయ్యాయి. ఫోన్‌కు సంబంధించిన వివరాలు అంతర్జాతీయంగా ట్రెండింగ్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో Vivo X100 సంబంధించిన పూర్తి సమాచారం మీకోసం.

    మెుబైల్‌ వేరియంట్స్‌

    ‘Vivo X100 Series’ సిరీస్‌ను Vivo X90 సిరీస్‌కు అనుసంధానంగా తీసుకొస్తున్నారు. మెుత్తం మూడు వేరియంట్లలో ఈ ఫోన్‌ రానున్నట్లు సమాచారం. ‘Vivo X100’, ‘Vivo X100 Pro’, ‘Vivo X100 Pro+’ వేరియంట్లలో ఫోన్‌ రిలీజ్‌ కానున్నట్లు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 

    ఫోన్‌ డిస్‌ప్లే

    Vivo X100 సిరీస్‌ను AMOLED డిస్‌ప్లేతో తీసుకొస్తున్నారు. దీనికి 120Hz రిఫ్రెష్‌ రేట్‌ను అందించనున్నారు. ఈ సిరీస్‌లోని మెుబైల్స్‌ MediaTek Dimensity 9300 చిప్‌సెట్‌తో రానున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌, నెక్స్ట్‌ జనరేషన్‌ ప్రొసెసర్‌ N4Pతో వర్క్‌ చేయనుంది. 

    కెమెరా క్వాలిటీ

    Vivo X100 సిరీస్‌ కెమెరా నాణ్యతను వివో భారీగా పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. Pro, Pro plus వేరియంట్‌ ప్రైమరీ కెమెరా ఏకంగా 200MP వరకూ ఉండొచ్చని తెలిసింది. దీనికి అనుసంధానంగా 50MP అల్ట్రా వైడ్‌ రియర్ కెమెరా రానుందట. సెల్ఫీ కెమెరాకు సంబంధించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. 

    శక్తివంతమైన బ్యాటరీ

    Vivo X100 సిరీస్‌ను శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇది ఏకంగా 100W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్ చేస్తుందని లీకైన సమాచారం చెబుతోంది. అదే నిజమైతే మెుబైల్‌ను క్షణాల్లో 100% ఛార్జ్‌ చేసుకోవచ్చు.

    5G సపోర్ట్‌

    Vivo X100 సిరీస్‌లోని అన్ని మోడల్‌ ఫోన్స్‌ 5G సపోర్ట్‌తో రానున్నాయి. ఇవి ఫాస్ట్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ను అందిస్తాయని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి.  

    వాటర్‌ రెసిస్టెన్స్‌

    Vivo X100 సిరీస్‌లోని Pro, Pro+ మోడళ్లను వాటర్‌ రెసిస్టెన్సీతో తీసుకొస్తున్నట్లు సమాచారం. వాటర్‌, దుమ్ము-దూళిని తట్టుకునే IP68 రేటింగ్‌ను ఫోన్‌కు అందించనున్నట్లు తెలుస్తోంది. 

    ధర ఎంతంటే?

    Vivo X100 సిరీస్‌కు సంబంధించిన ధరలను వివో అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ సిరీస్‌లోని బేసిక్‌ మోడల్‌ ధర రూ. 59,990 ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీన్ని బట్టి Pro, Pro+ మరింత ప్రియంగా ఉండే ఛాన్స్ ఉంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version