ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక ఆపరేషన్‌ను ప్రారంభించడం తప్ప తమ దేశానికి వేరే మార్గం లేదని, ఆత్మ రక్షణ కోసం మాత్రమే ఇలా చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. క్రిమియా, డాన్‌బాస్‌లపై దాడి చేయాలనే ఉక్రెయిన్ ప్రణాళికలను రష్యా అడ్డుకున్నదని చెబుతూ, దేశంలో ప్రత్యేక ఆపరేషన్ ప్రణాళిక ప్రకారం జరుగుతుందని పుతిన్ నొక్కి చెప్పారు. జాతీయ టెలివిజన్‌లో ప్రసారమైన ప్రభుత్వ సమావేశంలో రష్యా అధ్యక్షుడు మాట్లాడుతూ.. విడిపోయిన డొనెట్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ క్షిపణి దాడిని ‘పిరికి ఉగ్రవాద చర్య’గా వర్ణించారు. ఉక్రెయిన్‌లో తన సైనిక చర్య విజయవంతమైందని, రష్యాను బెదిరించే “స్ప్రింగ్‌బోర్డ్”గా ఆ దేశాన్ని మార్చడానికి తాను అనుమతించబోనని అధ్యక్షుడు పుతిన్ అన్నారు.