ఓ సాధారణ ముఠా కార్మికుడు అదృశ్యమైన 500 గ్రామాలను గుర్తించాడు. ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లెకు చెందిన శివశంకర్ 5వ తరగతి వరకు చదివాడు. అనంతరం గుంటూరులో ముఠా పనులు చేస్తూ జీవిస్తున్నాడు. పురాతన ఆలయాలకు వెళ్తున్నప్పుడు చరిత్ర గురించి ఆసక్తి పెంచుకున్నాడు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో అదృశ్యమైన 500 గ్రామాలను గుర్తించాడు. ఆ గ్రామాల పుట్టుపూర్వొత్తరాలు, చరిత్ర, సంస్కృతి తెలుసుకున్నాడు.