ఏపీలో వాలంటీర్లకు తిప్పలు తప్పట్లేదు. అటు అధికారుల వైపు నుంచి ఇటు ప్రజల వైపు నుంచి ఒత్తిడి పెరిగిపోతుంది. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం రామదాస్ నాయక్ తండాలో వాలంటీర్‌గా పనిచేస్తున్న నగేష్ నాయక్ చెప్పు తీసుకొని కొట్టుకోవడం కలకలం రేపింది. అతడు ఈ-క్రాప్ బుకిగ్ చేయించిన 50 మంది రైతుల్లో ఒకరికి మాత్రమే పంట బీమా వచ్చింది. కానీ ఇతరులకు రాలేదు. దీంతో రైతులందరూ వాలంటీర్‌పై విరుచుకుపడ్డారు. ఏవో సాంకేలిక కారణాలతో రాలేదని చెప్తున్నా వాళ్లు పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన ఆయన వాలంటీర్‌గా ఉన్నందుకు తనకు ఈ శాస్తి జరగాల్సందేనని చెప్తూ చెప్పు తీసుకొని కొట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.