గుజరాత్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ పరిధిలో ఉన్న రాణిప్ నిషాన్ పాఠశాలలో ఆయన ఓటు వేశారు. సాధారణ పౌరుల లాగే క్యూలైన్లో నిల్చున్నారు. ఓటు వేసిన అనంతరం తన చూపుడు వేలుకు ఉన్న సిరా గుర్తును మీడియాకు చూపించారు. ఓటు వేసిన అనంతరం మోదీ తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు. కాగా ప్రధాని మోదీ సహా ఇతర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటు వేసిన ప్రధాని మోదీ

Courtesy Twitter: Narendra Modi