బిగ్‌బాస్‌లో ఈవారం మొత్తం ఫైనలిస్టుల జర్నీని చూపిస్తున్నారు. ఈరోజు మిత్రా శర్మ జర్నీని చూపించనున్నారు. మిత్రా శర్మ చివరి వారం వరకు వస్తుందని ఎవరూ ఊహించలేదు. వచ్చినప్పటినుంచి ఆమెపై ప్రేక్షకులకు నెగెటివ్ ఇంప్రెషన్ ఏర్పడింది. కానీ ఇన్ని వారాలుగా సేవ్ అవుతూ ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఇక ఫైనల్ ఓటింగ్ నిన్నటితో ముగిసింది. ఈ ఓటింగ్‌లో కూడా మిత్రా టాప్ 3లో నిలిచినట్లుగా తెలుస్తుంది. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్‌గా బిందు మాదవి, రన్నర్‌గా అఖిల్ ఉన్నట్లు టాక్. నాలుగో ప్లేస్‌లో శివ, ఐదో స్థానంలో అరియానా నిలిచినట్లు కొన్ని వెబ్సైట్ల పోల్స్ ద్వారా తెలుస్తోంది.