యాదాద్రిని సందర్శంచే వీవీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది తెలంగాణ ప్రభుత్వం. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (YTDA ) వారి కోసం పచ్చని ఉద్యానవనాలు, విశాలమైన గదులు, టెంపుల్ వ్యూ, ప్రెసిడెన్షియల్ సూట్, VVIP సూట్లు ఏర్పాటుచేసింది . 14 VVIP సూట్లు, ఒక ప్రెసిడెన్షియల్ సూట్ గండి చెరువుకు సమీపంలో ఉన్న ఒక కొండపై నిర్మించారు, ఈ వారంలో గోదావరి జలాలతో మినీ బండ్‌గా అభివృద్ధి చేసిన ఇరిగేషన్ ట్యాంక్ అందుబాటులోకి వస్తుంది. VVIP సూట్లో బెడ్రూమ్, విశాలమైన కిచెన్-కమ్-డైనింగ్ హాల్, వెయిటింగ్ లాంజ్, డ్రాయింగ్ రూమ్ ఉంటాయి. ఈ సూట్లన్నింటినీ కాంట్రాక్టర్లు సోమవారం యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (YTDA )కి అందజేస్తారు. గది ధరలు, ఇతర ఛార్జీలను త్వరలో YTDA నిర్ణయిస్తుంది. భక్తుల కోసం 250 నుంచి 300 కాటేజీల నిర్మాణం కోసం వైటీడీఏ సమీపంలోని కొండ ‘పెద్దగుట్ట’పై 250 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించింది.