ఐర్లాండ్‌తో జరిగే 2 మ్యాచ్‌ల T20I సిరీస్‌కు భారత జూనియర్ జట్టుకు మొదటిసారిగా VVS లక్ష్మణ్ ప్రధాన కోచ్ గా వ్యవహరించనున్నారు. వీవీఎస్ తో పాటు NCA కోచులు కూడా ఉండనున్నారు. ఈ మేరకు BCCI అధికార వర్గాలు వెల్లడించాయి. టీమిండియా జూన్ 26 నుంచి 28 తేదీల్లో రెండు T20Iలు ఆడనున్నట్లు తెలుస్తోంది. అయితే ఐర్లాండ్ సిరీస్‌కు జట్టును ఇంకా ప్రకటించలేదు. ఐర్లాండ్‌తో భారత్ ప్రాథమికంగా టీ20 స్పెషలిస్ట్‌లతో కూడిన జట్టును రంగంలోకి దించనుంది. ప్రస్తుతం VVS లక్ష్మణ్ NCA డెరెక్టర్ గా కొనసాగుతున్నారు.