అమెరికాకు చదువుకునేందుకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. F1 వీసా ఇంటర్వ్యూ స్లాట్ల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. వచ్చే నెల రెండోవారంలోగా అమెరికాలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో తరగతులు ప్రారంభం కాబోతున్నాయి. తొలిసారి ఇంటర్వ్యూ స్లాట్ దొరకక వేచి చూస్తున్న విద్యార్థులు కొందరైతే, రెండో సారి అవకాశం కోసం చూస్తున్నవారు కూడా చాలామందే ఉన్నారు. విద్యా సంవత్సరం నష్టపోవాల్సి వస్తుందేమోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.