‘ఎన్టీఆర్30’ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎంపికైంది. ఈ నేపథ్యంలో షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నట్లు జాన్వీ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తారక్‌తో కలిసి నటించే రోజు కోసం ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. స్క్రిప్ట్ ఎంతో బాగుందంటూ కొనియాడింది. ఎన్టీఆర్ అభిమానినంటూ గతంలోనూ పలుమార్లు జాన్వీ మనసు విప్పి మాట్లాడింది. తారక్‌తో నటించేందుకు ఒక్క ఛాన్స్ కావాలని కోరింది. దీంతో ‘ఎన్టీఆర్30’ సినిమాతో జాన్వీకి కల నెరవేరనుంది. ఈ సినిమాతోనే జాన్వీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. జాన్వీ శ్రీదేవి కుమార్తె.
-
Screengrab Twitter:ntrartsofficial
-
Screengrab Twitter:ntrartsofficial