వరి ఉత్పత్తితో దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా నిలుస్తోందని ముఖ్యమంత్రి KCR అన్నారు. వరి ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే దిశగా చర్యలు చేపడతామని ఆయన అన్నారు. అందుకు అనుగుణంగా 2 శాతం సిఎస్టీ పన్ను బకాయిని మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ఈ పన్ను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. తమ అభ్యర్థనను మన్నించిన ముఖ్యమంత్రికి తెలంగాణ రైతు మిల్లర్ల సంఘం ధన్యవాదాలు తెలిపింది.