ప్రపంచంలోనే అత్యంత షార్ప్ స్నిపర్గా పేరు తెచ్చుకున్న మాజీ కెనడియన్ సైనికుడు వలీ ప్రస్తుతం ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు. వలీ కెనడియన్ 22వ రెజిమెంట్‌కు చెందిన సైనికుడు. తాను ఉక్రెయిన్ సైన్యంలో చేరడాన్ని, ఆ దేశస్తులు స్వాగతిస్తున్నారని వలీ చెప్పాడు. ఇప్పటికే ఉక్రెయిన్ సైన్యంలో చేరిన వలీ 6గురు రష్యా సైనికులను హతమార్చినట్లు పలు నివేదికలు తెలుపుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన స్నిపర్గా వలీని పిలుస్తారు. తనదైన రోజున వలీ శత్రు సైనికులకు చుక్కలు చూపించగలడు. ఇతడు అఫ్ఘనిస్తాన్‌లో పనిచేసినపుడు వలీ అనే పేరును పొందాడు. అరబిక్ భాషలో వలీ అంటే రక్షకుడు అని అర్థం.